ఎముకలకు పూర్తి ఉచితంగా ఆపరేషన్లు చేసే ఆసుపత్రి

మనుషుల జీవన విధానంలో ఎముకలు కీలకపాత్ర వహిస్తాయనేది మనందరికీ తెలిసిన విషయమే . అటువంటి ఎముకలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా ఆ వ్యక్తితో పాటు ,
మొత్తం కుటుంబమే ఆర్ధిక సమస్యల్లోకి వెళుతుంది.
కొందరికి ప్రమాదాల వల్ల , మరికొందరికి అనారోగ్య సమస్యల వల్ల
ఎముకలకు పాక్షిక లేదా పూర్తి అంగవైకల్యం సంభవిస్తూ ఉంటుంది.
అలా ఎముకలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా……….
ఒక్క పైసా కూడా వైద్య ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా వైద్యం చేసే ఆసుపత్రి
ఒకటి ఉందని మీకు తెలుసా………..?
అవును …….మీరు చదువుతున్నది అక్షరాలా నిజమే………..
ఎముకలకు సంబంధించిన ఎటువంటి పెద్ద ఆపరేషన్ అయినా ఉచితంగా చేసే ఆసుపత్రి
అనంతపురం జిల్లా పుట్టపర్తి లో ఉంది.
శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా పిలువబడే ఈ ఆసుపత్రిలో
రోగులకు ప్రపంచ స్థాయి కార్పోరేట్ వైద్యం పూర్తి ఉచితంగా అందుతుంది.
ఎముకలకు సంబంధించి మీరు ఇంతకముందు ఇతర ఆసుపత్రులలో చూపించుకున్న
మెడికల్ రిపోర్టులను తీసుకొని, ఉదయం ఆరు గంటల కల్లా ఈ ఆసుపత్రి ముందు క్యూ లో ఉన్నట్లయితే , ఏడు గంటల నుండి టోకెన్ల ద్వారా ఆసుపత్రిలోపలికి అనుమతిస్తారు.
దేశంలోని వివిధ దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు
తెల్లవారుజామున మూడు గంటల నుండే క్యూలైన్లలో వేచి చూస్తూ ఉంటారు.
అక్కడ లోపల ఉన్న ప్రత్యేక గదిలో పాత మెడికల్ రిపోర్టులను పరిశీలించి ,
ఏయే జబ్బులకు సంబంధించి , ఆయా విభాగపు వైద్యుల రూముల దగ్గరికి లోపలికి పంపిస్తారు.
పేషంట్ దృవీకరణ కోసం ఓటర్ కార్డుగానీ, ఆధార్ కార్డుగానీ, రేషన్ కార్డు గానీ ఉంటే మంచిది.
పేషంట్ తో పాటు మరొకరిని కూడా తోడుగా లోపలికి అనుమతిస్తారు.
అనంతపురం పట్టణం నుండి ప్రతి అర్ధ గంటకూ ఒక బస్సు సౌకర్యం ఉంది.
అదే విధంగా పుట్టపర్తిలోని ప్రశాంతి రైల్వే స్టేషన్ కు వివిధ ప్రాంతాల నుండి రైల్వే సౌకర్యం కూడా ఉంది.
ప్రశాంతి రైల్వే స్టేషన్ నుండి ఆసుపత్రి వద్దకు బస్సు మరియు ఆటో సౌకర్యం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *