దీపావళి రోజు ఖచ్చితంగా దీపాలు వెలిగించాల్సిన ప్రదేశాలు ??

పూజ గదిలో

దీపావళి రోజు ఇంట్లో పూజ గదిలో దీపం ఖచ్చితంగా వెలిగించాలి. ఈ దీపంను నెయ్యితో వెలిగించాలి. నెయ్యి నిండుగా ఉండాలి. ఎందుకంటే.. ఈ దీపం రాత్రంతా వెలగాలి.

దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ దేవిని పూజించడం వల్ల.. సంపద పొందుతారని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో దీపావళి రోజు దీపాలు వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షం పొంది, సంపద, శ్రేయస్సు పొందుతారు.

diya on diwali

దీపం అంటే.. దీపావళికి ప్రతిరూపం. ఇంట్లోని ప్రతి మూల దీపం వెలిగించడం సంప్రదాయంగా వస్తుంది. దీపావళి రోజు ఇల్లంతా దీపకాంతులతో వెలిగిపోవడం మనం చూస్తుంటాం. కానీ.. దీపాలు వెలిగించడం వెనక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

దీపం అంటే నాలెడ్జ్ అని అర్థం. దీపం వెలిగించడం వల్ల.. ఆ వ్యక్తి జీవితంలో చీకటి వెల్లిపోయి వెలుగు వస్తుందని సూచిస్తుంది. అయితే దీపావళి రోజు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే.. జీవితంలో ఉన్న దురదృష్టం, సమస్యలు తొలగిపోయి.. ఆర్థికంగా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపావళి రోజు ఖచ్చితంగా దీపాలు వెలిగించాల్సిన ప్రదేశాలేంటో చూద్దాం..

రోడ్ల కూడలి

రోడ్ల కూడలి

మీ జీవితంలో, మీకు ఉన్న దురదృష్టం తొలగిపోవాలంటే.. రోడ్ల కూడలిలో.. అంటే రెండు రోడ్లు కలిసే ప్రదేశంలో దీపావళి రోజు రాత్రి దీపం వెలిగించాలి.

మెయిన్ గేట్

మెయిన్ గేట్

దీపావళి రోజు రాత్రిపూట రెండు దీపాలను మీ మెయిన్ గేట్ ఎదురుగా అటు ఒకటి, ఇటు ఒకటి వెలిగించాలి. ఇలా చేయడం వల్ల.. దీపావళి రోజు సంపద పొందుతారు.

రాగిచెట్టు

రాగిచెట్టు

రాగి చెట్టు కింద దీపావళి రోజు రాత్రి దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత.. వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి.

పూజ గదిలో

పూజ గదిలో

దీపావళి రోజు ఇంట్లో పూజ గదిలో దీపం ఖచ్చితంగా వెలిగించాలి. ఈ దీపంను నెయ్యితో వెలిగించాలి. నెయ్యి నిండుగా ఉండాలి. ఎందుకంటే.. ఈ దీపం రాత్రంతా వెలగాలి.

గుళ్లో

గుళ్లో

దీపావళి రోజు రాత్రి ఏ గుళ్లో అయినా.. దీపం వెలిగించడం వల్ల.. ఆ దేవుడి ఆశీస్సులు పొందవచ్చు.

బిల్వ చెట్టు

బిల్వ చెట్టు

దీపావళి రోజు బిల్వ చెట్టు కింద దీపం వెలిగిస్తే.. ఆ శివుడి అనుగ్రహం పొందవచ్చు.

వరండా

వరండా

ప్రతిరోజూ ఇంటి వరండాలో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివిటీ తొలగిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *