గ‌ర్భిణీ స్త్రీలు బంగారం ధ‌రించ‌కూడ‌ద‌ట‌… ఎందుకో మీరే చూడండి…?

చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు బంగారం ధ‌రించ‌డం అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాలంటే ప్ర‌ధానంగా మ‌హిళ‌లు అత్యంత ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు. న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు బంగారం ఒంటి మీద ఉంటే ఇక ఆ హోదా మనం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌గా వారు బంగారాన్ని ఇష్ట‌ప‌డ‌తారు. అయితే కొంద‌రు పురుషులు కూడా గోల్డ్ జ్యువెల్ల‌రీ ధ‌రించ‌డం ప‌ట్ల ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తారు లెండి. అది వేరే విష‌యం. సాధనంగా బంగారాన్ని ఇంట్లో స్టోర్ చేసి పెట్టి నప్పుడు లేక బంగారం ధ‌రించినప్పుడు , కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ట‌. లేదంటే వాస్తు, జ్యోతిష్యం ప్ర‌కారం ఆ బంగారం మ‌న‌కు మంచి ఫ‌లితాల‌ను ఇవ్వ‌ద‌ట‌. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. … దానికి మనం దానికి కొన్ని పద్ధతిలను అనుసరించాలి .

gols1
► బంగారం ధ‌రించ‌కుండా ఇంట్లో స్టోర్ చేసి పెడితే మాత్రం దాన్ని ఈశాన్య దిశ‌లో ఉంచాల‌ట‌. అదే మ‌న‌కు శుభ ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ట‌.

gols4► చిటికెన వేలికి బంగార‌పు ఉంగ‌రాన్ని ధ‌రిస్తే దాంతో జలుబు, ద‌గ్గు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌. అదే విధంగా స్థూల‌కాయం, అధిక బ‌రువు ఉన్న‌వారు బంగారాన్ని అధికంగా ధ‌రించ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ట‌.

► పెళ్ల‌యిన స్త్రీ, పురుషులు ఎవ‌రైనా త‌మ చూపుడు వేలికి బంగార‌పు ఉంగ‌రాన్ని అలాగే మెడ‌లో ఓ బంగారు గొలుసును ధ‌రిస్తే దాంతో వారి దాంపత్య జీవితం సుఖ‌మ‌యంగా సాగుతుంద‌ట.

► గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు చిన్న చిన్న ఉంగ‌రాల వంటివి అయితే ఫ‌ర్వాలేదు కానీ పెద్ద పెద్ద న‌గ‌లు, ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే ఒంట్లో ఎక్కువ‌గా హీట్ ఉత్ప‌త్తి అయ్యి అది బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంద‌ట‌.

► బంగారం ధ‌రించ‌కుండా ఇంట్లో పెట్టే ప‌నైతే దాన్ని ఎరుపు లేదా ప‌సుపు రంగు వ‌స్త్రంలో పెట్టి దానికి తోడుగా కొద్దిగా కుంకుమ పువ్వు చేర్చి పెట్టుకోవాల‌ట‌. ఇలా చేయ‌డం వ‌ల్ల అంతా శుభమే జ‌రుగుతుంద‌ట‌. సంప‌ద బాగా సిద్ధిస్తుంద‌ట‌.

► మ‌హిళ‌లు బంగారాన్ని వ‌డ్డాణం రూపంలో న‌డుముకు ధ‌రిస్తారు. కానీ అలా చేయ‌కూడ‌ద‌ట‌. ఎందుకంటే అలా ధ‌రిస్తే జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.

► బృహ‌స్ప‌తి, సూర్యుడు బంగారానికి అధిప‌తుల‌ట‌. క‌నుక ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రులు, బ్రాహ్మ‌ణులు బంగారం దానం ఇస్తే తీసుకోవాల‌ట‌. అంతే కానీ శ‌త్రువులు ఎవ‌రైనా బంగారం దానమిస్తే తీసుకోకూడ‌ద‌ట‌.

► ఇనుప వ‌స్తువుల‌ను త‌యారు చేసే వారు, కంసాలిలు బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌కూడ‌ద‌ట‌. ఎందుకంటే బంగారానికి అధిప‌తులైన బృహస్ప‌తి, సూర్యుడు ఇద్ద‌రు ఇనుముకు అధిప‌తి అయిన శ‌నికి బ‌ద్ద శ‌త్రువుల‌ట‌. క‌నుక వారు బంగారం ధ‌రించ‌కూడ‌ద‌ట‌.

► చాలా మంది మ‌హిళ‌లు వెండి ప‌ట్టీలు కాకుండా బంగారు ప‌ట్టీల‌ను ధ‌రిస్తారు క‌దా. కానీ అలా చేయ‌కూడ‌ద‌ట‌. ఎందుకంటే బంగారాన్ని అలా కాళ్ల‌కు ధ‌రిస్తే వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అంతేకాదు, ఆరోగ్యం కూడా పాడ‌వుతుంద‌ట‌.

► శ్మశానాల్లో అంత్య క్రియ‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారిపై బంగారాన్ని ఉంచిన నీటిని పోస్తే అలాంటి వ్య‌క్తులు ప‌రిశుద్ధుల‌వుతార‌ట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *