పాకిస్తాన్ అమ్మ మొగుడు.!! ఇండియన్ జేమ్స్ బాండ్.. అజిత్ దోవల్

ఇండియన్ జేమ్స్ బాండ్.. అజిత్ దోవల్

అజిత్ దోవల్.. ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్న పేరు. పీఓకేలో పాక్ కు గట్టిగా సమాధానం చెప్పిన వ్యక్తిగా.. ప్రధాని మోడీ తురుపు ముక్కగా ప్రశంసలు అందుకుంటున్న వ్యక్తి దోవల్. యూరీ ఎటాక్ కు ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా అని ఎదురుచూస్తున్న భారతీయులకు తీపి వార్తను అందించిన ఘనుడు ఈయన. సైనిక చర్యల్లో ముందుండి నడిపించి.. ఆవేశంతో ఉన్న భారత యువతకు మేము ఆ పనిలోనే ఉన్నామని చేసి చూపించాడు దోవల్. ఈ పథకానికి వారం రోజుల ముందునుంచే ప్లాన్ ప్రిపేర్ అయ్యింది. కానీ ఒక్కో అడుగు పడటానికి కాస్త టైమ్ పట్టింది అంతే.

ఇండియన్ జేమ్స్ బాండ్ గా అందరితో ప్రశంసలు అందుకుంటున్నఅజిత్ దోవల్ ను వ్యూహాత్మకంగా తన టీమ్ లోకి తీసుకున్నారు మోడీ. 2014 మే 26న మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే అంటే మే 30న దోవల్ జాతీయ భద్రతా సలహాదారు పదవిలో నియమితులయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. సరిహద్దుల్లో జరుగుతున్న వాటిని నిశితంగా పరిశీలిస్తూ.. పాక్ చర్యలపై తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి వ్యూహరచన చేశారు. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది.

దోవల్ ప్రత్యేకతలు:

… 1988 పంజాబ్‌లోని ఆపరేషన్ బ్లాక్ థండర్ ను సక్సెస్ చేసింది ఈయనే.

… ప్రార్థనామందిరంలో దాగున్న ఉగ్రవాదులతో రిక్షా కార్మికుని వేషంలో మాట్లాడి లొంగిపోయేలా చేశారు.

… ఉత్తరాఖండ్‌ కేడర్ కు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి దోవల్‌

… కేరళతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.

… సైలెంట్ గా తన పని తాను చేసుకు పోవడంలో దిట్ట

… పాక్‌ను ఏకాకి చేయడంలో కీలక పాత్ర పోషించారు.

… పాక్‌లోని భారత దౌత్యకార్యాలయంలో ఏడేళ్లు పనిచేసిన అనుభవం

… పఠాన్‌కోట్‌ దాడుల్లో మిలటరీకి చేదోడువాదోడుగా ఉన్నారు.

… ఇప్పుడు పీవోకేలో భారత దళాల మెరుపుదాడుల వెనక కీలకపాత్ర.

… 1971-99 మధ్య భారత్‌లో జరిగిన 15 విమాన హైజాకింగ్‌ యత్నాలను ఆయన ఆధ్వర్యంలోని భద్రతాదళాలు అడ్డుకొని కుట్రదారుల యత్నాలను భగ్నం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *