స్వర్గం నరకం అంటే ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు ఈ కథ చదవాల్సిందే.!!!

? స్వర్గం -నరకం –

?ఒక  వ్యక్తి మరణించాడు.
అతడు చేసిన పాప పుణ్యాలకు ఒకరోజు నరకం ఒకరోజు స్వర్గం లో ఉండాలని చెప్పడం తో నరకం లోకి కాలుపెట్టాడు..?

?అక్కడ చుట్టూ చెత్తా దుమ్ము తో చాలా మురికిగా  ఉంది.?
మనుషులూఅందరూ ఎక్కడంటే అక్కడ పడుకొని దొర్లుతూన్నారు. ?
చూడ్డానికి  మాత్రమ్ బక్క చిక్కిపోయి  ఉన్నారు.??
అన్నము తిని ఎన్నిరోజులు ఐనదో అనేలా ఉన్నారు. ??
ఎవరి ముఖము చూసినా విచారము తో దిగులుగా ఉంది. ??
ఆ వ్యక్తి వీళ్ళకు అన్నము పెట్టకుండా ఇలా వదిలేస్తారేమో ఆకలితో అనుకొన్నాడు.?
ఇంతలో ఒక గంట మ్రోగింది.??
వెంటనే అందరూ ఒక పెద్ద హాలు వంటి గది వైపు వెళుతున్నారు.. ???
అతడు వెళ్ళాడు.
వెళ్ళి నిర్ఘాంతపోయాడు. ?
అది ఒక పెద్ద భోజనశాల.
మధ్య లో చలా పొడవైన  బల్ల ఉంది. ???
దానిమీద అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నయ్. ??
శఖాహార, మాంసాహార పదార్థాలు మిఠాయిలు ఫలాహారాలు. ???
మరి వాళ్ళు యెందుకు బక్క చిక్కి పోయారు అని ఆ వ్యక్తి కి సందేహం వచినది. ????
అందరూ బల్లలకు ఇరువైపులా కూర్చోగానే వాళ్ళ చేతులకి పెద్ద పెద్ద గరిటెలు కట్టారు. ??
అవి చాలా పొడవుగా ఉన్నాయి.
అందరూ తినడానికి ప్రయత్నము చేసారు.
అంత పొడవు గరిటెలతో తినడము అసాధ్యమైనది.?
చివరకు కొన్ని మెతుకులు మత్రమే నోటిలో పడ్డాయి.?
సమయము ముగియడం తో అందరూ నిరాశగా వెనుదిరిగి వెళ్ళారు..?

?ఆ రోజు రాత్రి భోజనసమయము లో కుడా అలాగే జరిగింది.?

?ఉదయాన్నే ఆ వ్యక్తినీ స్వర్గానికి తీసుకెళ్ళారు.
స్వర్గము  చాలా అందముగా,శుభ్రం  గా ఉంది.?
అక్కడున్న వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బలము గా ఉన్నారు. ☺
పరిసరాలను శుభ్ర పరుస్తూ మొక్కలకు నీళ్ళు పోస్తూ పనుల్లో ఉన్నారు. ?
మధ్యాహ్నం అవుతూనే అక్కడ కూడా గంట ?కొట్టారు వెంటనే వాళ్ళందరూ భోజనశాల కివెళ్ళారు.
అది కుడా నరకం లో మాదిరే పొడవుగా ఉంది.
నరకం లో మాదిరే అన్ని పదార్ధాలు ఉన్నాయి. ?
తినడానికి కూర్చోగానే వాళ్ళచేతులకూ  పొడవైన గరిటెలు కట్టారు….?
అది చూస్తూనే  ఆ వ్యక్తి కి ఏమీ అర్థము కాలేదు.. ??
ఇక్కడ కుడా అలాగే ఉంటే మరి వాళ్ళు యేల అంత బలము గా ఉన్నారో అనుకొంటూ ఉండగా వాళ్ళు తినడము మొదలు పెట్టారు…?
చూస్తుండగానే అన్ని తినేసారు……… ??

  ఎవరి చేత్తో వాళ్ళు తినకుండా ఎదురుగా కుర్చున్న వాళ్ళకు   తినిపించుకోన్నారు…??
అలా  కడుపునిండా తినగలిగారు..??

?మనము ఎదుటివారికి సహాయము చేస్తున్నాము అంటే స్వర్గము లో ఉన్నాము అని,  ఆ సహాయము మనకు ఏదో ఒక రూపము లో మనకు తిరిగి వస్తుంది.??

స్వార్ధం తో నేను మాత్రమే అనుకొంటే నరకం లో ఉన్నట్లే.
☝Always help to others?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *