దీపావళీ రోజున ఇలా చేయండి. ఎలాంటి కష్టాలైన భాదలైనా తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి.

దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడం హిందువుల సంప్రదాయం. ఆ రోజు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి ఇంట్లో లక్ష్మీ పూజలు చేసుకుంటారు. తమ కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. అయితే ఎలాంటి ఫలితం కోసం లక్ష్మిని ఎలా పూజించాలన్నది శాస్త్రం చెపుతోంది. ఆయుష్షు కోసం…
దీపావళి రోజున లక్ష్మీదేవికి చెరకు రసం నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులు అందరూ స్వీకరించటం వల్ల కీర్తి ప్రతిష్టలు, ఆయుష్షు పెరుగుతుంది. కఠినమైన దరిద్రం తొలగిపోయేందుకు..
చతురస్త్రాకారంలో ఉండే రాగి ముక్కలు, మరీ ముఖ్యంగా పాత రాగి నాణేలు పారే నీటిలో వేయటం ద్వారా కఠినమైన దరిద్రం తొలగిపోతాయి.

స్థిరమైన ఉద్యోగం కోసం..
స్థిరమైన ఉద్యోగం, లక్ష్మీదేవి కటాక్షం కోసం ఐదుగురు ముత్తైదువులకు కొబ్బరిబోండాలను దక్షిణ, తాంబూలాలతో కలిపి దానం ఇవ్వాలి.

వివాహంలో ఆటంకాలు తొలగేటందుకు..
వివాహపరంగా చిన్న, చిన్న ఆటంకాలు వస్తున్నప్పుడు దీపావళి రోజున మహాలక్ష్మి పూజ అయ్యాక అమ్మవారికి అరిటాకులో మహానైవేద్యం, అందులో బల్లపు రమాన్నం, మంచామృతాలు ఉండే విధంగా చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.
ఆలస్య వివాహాలు, ఉద్యోగపరంగా సెటిల్ కాని వారు ఎరుపు రంగులో గుడ్డో నల్ల నువ్వులు, గోధుమలు కలిపి ఉంచి మూటకట్టి పారే నీటిలో వేయాలి. ఏ మాత్రం జాతక పరంగా యోగం ఉన్న మంచి ఫలితాలు లభిస్తాయి.

ఉద్యోగంలో నిలకడలేని వారు..
ఉద్యోగంలో నిలకడలేని వాదని భావించే వారు దీపావళితో మొదలు పెట్టి 11 శనివారాలు గోధుమపిండి లేక మైదా పిండితో చూసిన పూరీలు శనగపిండి కూరతో యథాశక్తి పేదవారికి పంచిపెట్టాలి.
నిరుద్యోగులు..
18 తామరపూలు శ్రీమహాలక్ష్మికి సమర్పించి, ప్రదక్షిణ చేసి ఉద్యోగం వస్తే, శ్రీకక్చన చేయిస్తానని నమస్కారం చేయాలి.
స్త్రీ శాపాలు తొలగటానికి..
ఇంట్లో స్త్రీల సంఖ్య తగ్గుతున్నా, స్త్రీ శాపాలు ఉన్నా దీపావళి రోజున దేవాలయంలో పసుపు, కుంకుమ, చీర అమ్మవారి విగ్రహానికి ధరింపచేసి, దాన్ని తర్వాతి రోజు తిరిగి ఇమ్మని అడిగి, దాన్ని ఏదో ఒక రోజు ధరించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *