ఈ ఆరు సూచ‌న‌లు పాటిస్తే… ఎలాంటి ఆర్థిక స‌మ‌స్య‌లున్నా ఇట్టే పోతాయ‌ట‌..!

ఎంత సంపాదించినా డ‌బ్బు నీళ్ల‌లా ఖ‌ర్చ‌వుతుందా..? స‌ంపాద‌న చాల‌డం లేదా..? డ‌బ్బులు ఉండ‌డం లేదా..? డ‌బ్బు ఎలా వ‌స్తుందో అలాగే ఖ‌ర్చ‌వుతోందా..? అయితే మీరు దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్ర‌కారం ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో మీకు ధ‌న‌ప్రాప్తి క‌లుగుతుంది. ఐశ్వ‌ర్య‌వంతుల‌వుతారు. అంతా శుభ‌మే క‌లుగుతుంది. డ‌బ్బు పోవ‌డం జ‌ర‌గ‌దు, అంతా రావ‌డ‌మే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొల‌గిపోతాయి. అయితే అందుకు మీరు పాటించాల్సిన సూచ‌న‌లు ఏమిటంటే…

ప‌సుపు… 
ఒక ప‌సుపు రంగు వ‌స్త్రంలో కొంత ప‌సుపు వేసి దాన్ని బాగా ముడి వేసి అనంత‌రం ఆ మూట‌ను దిండు కింద పెట్టి నిద్రించండి. అంతే… ఆ త‌రువాత మీ జీవితంలో క‌లిగే మార్పుల‌ను మీరే గ‌మనిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ధ‌నం బాగా క‌లుగుతుంద‌ట‌. ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోతాయ‌ట‌.

రాగిపాత్ర‌లో నీరు… 
ఒక రాగి పాత్ర‌లో నీటిని పోసి ఆ పాత్ర‌ను మీరు నిద్రించే బెడ్ కింద పెట్టుకోండి. అలా వీలు కాక‌పోతే ఆ పాత్ర‌ను బెడ్ పక్క‌న కూడా పెట్టుకోవ‌చ్చు. దీంతోపాటు ఒక చిన్న ఎర్ర చందనం ముక్క‌ను మీరు నిద్రించే దిండు కింద పెట్టుకుని రాత్రి పూట ప‌డుకోండి. ఇలా చేయ‌డం వ‌ల్ల సూర్య భ‌గ‌వానుడి ఆశీస్సులు ల‌భిస్తాయ‌ట. అంతేకాదు, సంప‌ద మిక్కిలిగా వృద్ధి చెందుతుంద‌ట‌.

వెండి పాత్ర‌, ఆభ‌ర‌ణాలు… 
ఒక వెండి పాత్ర‌లో నీటిని పోసి పైన చెప్పిన‌ట్టుగా బెడ్ కింద లేదా ప‌క్క‌న పెట్టుకోవాలి. లేదంటే వెండితో చేసిన బ్రేస్‌లెట్లు, చెవి రింగులు వంటివి కూడా ధ‌రించ‌వ‌చ్చు. అలా చేస్తే ధ‌నం బాగా స‌మ‌కూరుతుంద‌ట‌. ఏది అనుకున్నా వెంట‌నే జ‌రిగిపోతుంద‌ట‌.

వెండి లేదా బంగారు ఆభ‌ర‌ణాలు
వెండి లేదా బంగారంతో చేసిన ఆభ‌ర‌ణాల‌ను దిండు కింద పెట్టుకుని నిద్రించాలి. లేదంటే ఒక కాంస్య పాత్ర‌లో నీటిని పోసి దాన్ని బెడ్ కింద లేదా ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జాత‌క చ‌క్రంలోని మంగ‌ళ దోషం పోతుంద‌ట‌. అంతేకాదు, దీంతో నిర్ణ‌యాలు తీసుకునే శ‌క్తి వ‌స్తుంద‌ట‌. ఐశ్వ‌ర్య‌వంతులు అవుతార‌ట‌.

వెండి చేప‌
వెండితో చేసిన చేప‌ను బెడ్ కింద పెట్టుకోవాలి. లేదంటే వెండి పాత్ర‌లో కొంత నీటిని పోసి దాన్ని బెడ్ ప‌క్క‌న పెట్టాలి. ఇలా చేయడం వ‌ల్ల ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం అనుకున్న‌ది జ‌రుగుతుంద‌ట‌. సంప‌ద బాగా వ‌స్తుంద‌ట‌.

ఇనుప పాత్ర‌… 
ఇనుముతో చేసిన పాత్ర‌లో కొంత నీటిని పోసి బెడ్ కింద లేదా ప‌క్క‌న పెట్టుకోవాలి. లేదంటే ఒక నీలం రాయిని దిండు కింద పెట్టి నిద్రించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌ని దోషం పోతుంద‌ట‌. అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ట‌. ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *